కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశం ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటల యుద్ధం అనంతరం ఇద్దరూ పరస్పరం తోపులాటకు దిగినట్లు తెలుస్తోంది.
సంజయ్ కుమార్ ప్రసంగం చేస్తుండగా, కౌశిక్ రెడ్డి మధ్యలో అడ్డుకట్టవేసి, “నీది ఏ పార్టీ?” అంటూ ప్రశ్నించడంతో గొడవ ప్రారంభమైందని సమాచారం. ఈ పరిణామం అక్కడి వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు తక్షణమే రంగప్రవేశం చేశారు. వారు కౌశిక్ రెడ్డిని సమావేశం హాలులో నుంచి బయటకు తీసుకెళ్లి పరిస్థితే అదుపు చేశారు. ఈ ఘటన కరీంనగర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సమావేశంలో చోటుచేసుకున్న ఈ వివాదం పై ప్రతిపక్షాలు, ప్రజలు ఎలా స్పందిస్తారనేది చూడాలి.